Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu inaugurated a Real Time Governance State Center at the Secretariat in Amaravati on Sunday. The Center has been developed for tracking the progress of all the districts in the state, through e-governance <br /> <br />పరిపాలనకు టెక్నాలజీని జోడించి ప్రజల చేత మన్ననలను పొందాలనే లక్ష్యంతో నూతన వ్యవస్థను ఆవిష్కరించారు ఎపి సిఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ సమాచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఎపి సచివాలయంలోని మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. <br />పరిపాలనలో టెక్నాలజీ మేళవించడం ద్వారా హైటెక్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరొందారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన చేపట్టిన మరో ప్రాజెక్ట్ రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీని ద్వారా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోని అధికారులు, ప్రజలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడవచ్చు.. విపత్తులు, ప్రమాదాల సమయంలో ఈ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ అధికారులు, సహాయ సిబ్బందికి సీఎం ఆదేశాలు ఇవ్వొచ్చు. దీని కోసం 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. అంతే కాదు సచివాలయం నుంచి డ్రోన్ల ద్వారా మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే అవకాశం ఉంది.
